అర్హులందరికీభూమి పంపిణీ: కోనేరు
హైదరాబాద్:అర్హులైనవారందరికీ భూములుఅందేలా చర్యలు తీసుకుంటామనిభూపంపిణీ కమిటీ చైర్మన్,మున్సిపల్ శాఖ మంత్రి కోనేరురంగారావు చెప్పారు. మావోయిస్టులు,వామపక్షాల ఒత్తిడికి తలొగ్గిభూపంపిణీకి ప్రభుత్వం ఈ కమిటీనినియమించింది. అధికార, అనధికారవర్గాలకు చెందినవారు దీనిలోఉన్నారు.
ఆరునెలల లోగా భూపంపిణీకిఅవసరమైన పనులన్నీ పూర్తి చేసినివేదిక సమర్పించవలసి ఉన్నదనిఆయన సోమవారం విలేకరులతోచెప్పారు. మిగులు భూములను, బంజరుభూములను, ఇతరులు ఆక్రమించుకున్నభూములను గుర్తిస్తామని ఆయనచెప్పారు. కమిటీ ఏర్పాటుపై వామపక్షాలుసందేహాలు వ్యక్తం చేశాయని వార్తల్లోనిజం లేదని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications