పెట్రోధరలపై మణిశంకర్‌ మౌనం

న్యూఢిల్లీ: పక్షం రోజులకోమారు పెట్రోల్‌, డీజిల్‌ రే ట్లను సవరిస్తామనిప్రకటించిన కేంద్రం రేపు వాటిధరలను పెంచుతుందా అని విలేకరులుఅడిగిన ప్రశ్నకు పెట్రోలియం మంత్రి మణిశంకర్‌అయ్యర్‌ కచ్చితమైన సమాధానం చెప్పలేదు.అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలకుఅనుగుణంగా భారతదేశంలో పక్షంరోజులకోసారి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లనుసవరిస్తామనిప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోరేపు మరోసారి రేట్లను సవరిస్తారా అనివిలేకరులు అడిగిన ప్రశ్నకు వేచి చూద్దాంఅని మాత్రం క్లుప్తంగా అయ్యర్‌ సమాధానంచెప్పారు.

రేట్లను స్థిరీకరించే వ్యవస్థనుఅమలు చేస్తామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ఇచ్చిన హామీపై వ్యాఖ్యానించాలని కోరగా ప్రస్తుతంలావో రాజధాని వియంటియేన్‌లో ప్రధాని ఉన్నారుకాబట్టి ఆయన తిరిగొచ్చాక ఈ విషయంపై చర్చిస్తాననిఅయ్యర్‌ చెప్పారు. అంతర్జాతీయ చమురుధరలు తగ్గుముఖం పట్టిన కారణంగాఇటీవల పెట్రోల్‌ ధరలను కొంత శాతంమేర తగ్గించినట్లు చెప్పారు. అయితే యధావిధిగానేఉన్న డీజిల్‌ ధరలను మంగళవారంపెంచే విషయంపై ఆయన ఖచ్చితమైనసమాధానం ఇవ్వలేదు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+