ఉచిత విద్యుత్‌పై అపోహలు వద్దు: సియం
హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంపై అపోహలు అవసరం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉండే వరకు రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆయన సోమవారం శాసనసభలో సమాధానమిచ్చారు. 93 శాతం రైతులకు ఉచిత విద్యుత్ వల్ల లాభం చేకూరుతుందని ఆయన అన్నారు.
ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబనాయుడు విమర్శించారు. అంతకు ముందు తెలుగుదేశం, బిజెపి సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం, బిజెపి సభ్యులు తమపై బురద చల్లే కార్యక్రమం తప్ప మరేమీ చేయడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రెండు ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించామని, మేలైన రీతిలో విద్యుత్‌ను సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
