ఏప్రిల్‌లోఅధికార యంత్రాంగంలో భారీ మార్పులు:సిఎం
హైదరాబాద్:పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామనిముఖ్యమంత్రి డాక్టర్‌వైఎస్ రాజశేఖరెడ్డి హెచ్చరించారు.ఆయన గురువారం ఇక్కడ విలేకరులసమావేశంలో మాట్లాడుతూ సరైనసమయంలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తామనిచెప్పారు. అవసరమనుకుంటే మంత్రుల శాఖల్లోమార్పులు చేస్తామని ఆయన అన్నారు. పని చేసేఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని, పని చేయనిఉద్యోగులకు బదిలీ శిక్ష తప్పదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఏప్రిల్‌లోరాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో భారీ మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు.
అధికారుల్లో అలసత్వాన్ని సహించబోమని ఆయన అన్నారు. అధికార యంత్రాంగంలో ఏప్రిల్ భారీ మార్పులుంటాయని ఆయన చెప్పారు. సమర్థంగా పని చేయనివారిని, ఫలితాలు చూపించనివారిని బదిలీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కసరత్తు మే మొదటివారానికల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణను చేపట్టాలా, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణపై సోనియా గాంధీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని విలేకరులు గుర్తు చేయగా ఆయన సూటిగా జవాబు ఇవ్వలేదు. తెలంగాణ వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి, రాష్ట్రంలోని ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఆయన చెప్పారు. తాము ప్రజలకిచ్చిన హామీలను నెరువేరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications