కందా పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి
హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా రాసిన ఫర్‌గివింగ్ అనే పుస్తకాన్ని గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం రాజభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వ్యవసాయరంగానికి కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచి ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయం ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని, అందుకే తాము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మహత్తరమైన కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. తమ లక్ష్య సాధనలో మోహన్ కందా పుస్తకం ఫర్‌గివింగ్ తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
