శాంతి స్థాపనకు నక్సల్స్ సహకరించాలి: కేశవరావు
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు మావోయిస్టులను కోరారు. హోలీ పండుగ సందర్భంగా కేశవరావు నివాసానికి పెద్ద యెత్తున పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనపై రంగులు చల్లారు.
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్ కూడా కేశవరావు నివాసానికి వచ్చి హోలీ ఆడారు. పరస్పరం రంగులు పూసుకుని ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా కేశవరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి సహరించి ప్రతి రోజూ హోలీ పండుగలాగా ఉండేలా సహకరించాలని ఆయన నక్సలైట్లను ఉద్దేశించి అన్నారు. తమ ప్రభుత్వం నక్సలైట్ల ఉద్దేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
