చట్టసభల్లో బాధ్యతతో వ్యవహరించాలి: స్పీకర్
హైదరాబాద్: చట్టసభల్లో సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి సూచించారు. శాసనసభ సజావుగా సాగడానికి రాజకీయ నాయకులు సహకరించాలని కూడా ఆయన కోరారు. లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా సురేష్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. సోమనాథ్ ఛటర్జీకి శాసనసభ జరిగే తీరును వివరించారు. సభ గందరగోళానికి దారి తీయకుండా సభ్యులు శాసనసభలో వ్యవహరించాలని ఆయన అన్నారు. పార్లమెంటు గ్రంథాలయాన్ని శాసనసభ గ్రంథాలయాలతో అనుసంధానం చేయడం మంచి పని అని సోమనాథ్ అన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
