3 భారీ మావోయిస్టుల డంప్‌లు స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లా పోలీసులు మూడు మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. చిత్రావతి అడవుల్లో ఈ డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏడు తుపాకులను, 200 తూటాలను, 14 వాకీటాకీలను, 14 కిట్ బ్యాగ్‌లను తదితర మందుపాతరల సామగ్రిని, ఆయుధాలను, కమ్యూనికేషన్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆంధ్ర, కర్ణాటక పోలీసుల తుపాకులు కూడా డంప్‌లో లభించాయి. మావోయిస్టుల టార్గెట్లను అప్రమత్తం చేసేందుకు అనంతపురం పోలీసులు మెసేజ్ సర్వీస్‌ను ప్రారంభించారు.
కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు బుక్కపట్నం మండలంలో ఒక వ్యాపారిని చంపారు. దీంతో పోలీసులు పెద్ద యెత్తున కూంబింగ్ చేపట్టారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీససుకొని విచారించగా మావోయిస్టుల డంప్‌లకు సంబంధించిన సమాచారం లభించింది.












Click it and Unblock the Notifications