నక్సల్స్‌పై నిషేధం ప్రతిపాదన చేయలేదు: వైయస్
న్యూఢిల్లీ: నక్సలైట్లపై నిషేధం విధించాలని తాము కేంద్రానికి ప్రతిపాదించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అంతర్గత భద్రతపై శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన న్యూఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
నక్సలైట్ల అంశంపై తాము ఏది చేసిన కేంద్రం అనుమతితోనే చేశామని ఆయన స్పష్టం చేశారు. నక్సలైట్లపై చర్చల విషయంలో వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బంతి నక్సల్స్ కోర్టులో ఉందని అన్నారు. తాము చర్చలకు ఆహ్వానించామని, వారి ప్రతిస్పందన కోసం చూస్తున్నామని ఆయన అన్నారు. అయితే శాంతిభత్రలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications