సమాచార హక్కుబిల్లును ఆమోదించిన లోక్‌సభ
న్యూఢిల్లీ: సమాచారాన్నితెలుసుకునే హక్కు కల్పించే సమాచారహక్కు బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది.ప్రతిపక్ష ఎన్డీయే బహిష్కరణ కొనసాగుతుండడంతో,వారి ప్రమేయం లేకుండానే ఈ బిల్లుఆమోదం పొందింది. సమాచార హక్కు వల్లపాలనా యంత్రాంగంలో ఒక కొత్త శకం ప్రారంభమైందని,అవినీతికి తెరపడుతుందని ప్రధానిమన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులతోసహా అందరూ ఈ హక్కు పట్ల సానుకూల దృక్పథంతోవ్యవహరించాలని కోరారు. ఈ బిల్లును ప్రభుత్వానికిప్రజలకు మధ్య సంబంధాలను మెరుగుపరచేఆయుధంగా అధికార యంత్రాంగం పరిగణించాలనిఅన్నారు.
బిల్లు వలన స్నేహపూర్వకమైన,ఫలవంతమైన, చక్కని పాలనను అందించడానికిప్రభుత్వానికి వీలవుతుందని తెలిపారు.150 సవరణలు జరిగిన సమాచార హక్కుబిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.2002లో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో జారీ అయినసమాచార స్వేచ్ఛా చట్టానికి, ప్రస్తుతసమాచార హక్కు బిల్లుకు చాలా వ్యత్యాసముందనిపచౌరీ సభకు తెలిపారు. ఈ బిల్లును జారీ చేయటంద్వారా జవాబుదారీతనంతో బాధ్యతాయుతమైనపారదర్శక పాలనను అందించాలని ప్రభుత్వంకోరుకుంటోందన్న విషయం తేటతెల్లమవుతున్నదనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications