హైదరాబాద్ లో ఇరానీ చాయ్ రూ. 80
ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం మనకు అలవాటు. గరంగరం టీ కడుపులో పడ్డాకే మిగిలిన పనులన్నీ. హైదరాబాద్ లో ఉండే వాళ్లకు ఇరానీ చాయ్ అంటే మరీ ఇష్టం. దీన్ని టేస్ట్ చేయడానికి తెల్లవారుజామునే లేచి మరీ కేఫ్ లల్లో కూర్చుంటారు. ఇరానీ చాయ్ కు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. మన నిత్యజీవితంలో భాగం. టెకీల నుండి దినసరి కూలీల వరకు అందరూ స్థానిక కేఫ్‌లలో తక్కువ ధరకే ఒక కప్పు చాయ్ ఆస్వాదిస్తుంటారు.
ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 1978 నుండి నగరంలో ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్.. చాయ్ రేట్లను పెంచింది. ఇప్పుడు ఫుల్ టీ 80 రూపాయలు, సింగిల్ టీ 60 రూపాయలు అయింది. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లను పెంచాల్సి వచ్చిందని నీలోఫర్ కేఫ్ యాజమాన్యం చెబుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 3,000 రూపాయలను దాటడం, ఎల్పీజీ కొరత, టీ పొడి, పాలు, చక్కెర రేట్లు పెరగడం వంటివి దీనికి కారణాలుగా చెబుతోంది కేఫ్ యాజమాన్యం.

ఈ ఆకస్మిక ధరల పెంపుతో అనేకమంది సాధారణ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. అయిదు దశాబ్దాలుగా నిలోఫర్ కేఫ్ లో మాత్రమే దొరికే డిఫరెంట్ టేస్ట్ ఇచ్చే ఇరానీ చాయ్ ను మిస్ అవుతున్నామనే ఆవేదన సోషల్ మీడియా యూజర్లల్లో కనిపిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా వీటి రేట్లను పెంచడాన్ని ఒకవంక సమర్థిస్తూనే.. టీ రేటు 80 రూపాయల వరకు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇరానీ చాయ్ ఇంత ఖరీదైనదిగా మారుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. వీటి రేట్లు ఇంత ఎక్కువగా ఉండకూడదనేది వారి వాదన. పాలు, టీపొడి రేటు పెరిగాయానే కారణంతో ఏకంగా ఓ కప్పు చాయ్ పై 80 రూపాయల వరకు వసూలు చేయడం సబబు కాదనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమౌతోంది. హైదరాబాద్ లోని నిమ్రా కేఫ్, బ్లూ సీ కేఫ్, కేఫ్ బహార్ వంటి చోట్ల కూడా ఇంత ధర లేదని చెబుతున్నారు.
ఈ వాదనలతో మరికొందరు నెటిజర్లు ఏకీభవించట్లేదు. ధరల పెంపు సాధారణమేనని చెబుతున్నారు. కొన్ని హోటల్ లల్లో లభించే టీతో పోల్చితే నిలోఫర్ కేఫ్ లో ధర తక్కువేనని తేల్చి చెబుతున్నారు. వాదించారు. కేఫ్ నీలోఫర్‌లో లభించే సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. టీకి అయ్యే ఖర్చు కంటే ప్రీమియం యాంబియన్స్ కోసం చేసే వ్యయం అధికంగా ఉంటుందనేది వారి వాదన.












Click it and Unblock the Notifications