సూపర్ టేస్టీ 'రవ్వ కేసరి'.. ఇదొక్కటి యాడ్ చేస్తే చాలు అద్భుతం అంతే..!

స్వీట్స్ లో రవ్వ కేసరి అనగానే చాలామందికి నోరూరుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు రవ్వకేసరిని ఇష్టంగా తింటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా ఏ ఫంక్షన్​ అయినా ఈ స్వీట్ కచ్చితంగా ఉండాల్సిందే. తయారీ వేగంగా ఉండటంతోపాటు టేస్ట్​ కూడా సూపర్ ​గా ఉండటంతో చాలా మంది ఈ స్వీట్ ​ను చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి రవ్వ కేసరి తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..?

రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా బొంబాయి రవ్వ ఒక కప్పు, చక్కెర 1.5 కప్పులు, పాలు ఒక కప్పు, నీళ్లు రెండు కప్పులు, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్, నెయ్యి అర కప్పు, పావు కప్పు, కిస్‌మిస్ పావు కప్పు, పసుపు, రవ్వ కేసరి రంగు చిటికెడు తీసుకోవాలి.

RavaKesari Recipe Make This Super Tasty Sweet Dish Easily Home with Simple Ingredients RavaKesari

రవ్వ కేసరి తయారు చేసే విధానం చూస్తే ముందుగా పాన్ లో నెయ్యి వేడి చేయాలి. అందులో బొంబాయి రవ్వను దోరగా వేయించుకోవాలి. మరొక పాత్రలో నీళ్లు, పాలు పోసి మరిగించాలి. ఇప్పుడు వేయించిన రవ్వను వేస్తూ కలుపుకోవాలి. అలా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికిన తర్వాత చక్కెర, యాలకుల పొడి, కుంకుమ పువ్వు రంగు వేసి బాగా కలుపుకోవాలి. ఇక మిగిలిన నెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించుకోవాలి. అలా కేసరిలో కలిపి దించుకోవాలి. ఇప్పుడు తయారైన రవ్వ కేసరిని వేడివేడిగా సర్వింగ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+