సాక్షి శివానంద్ ఆరోపణలు అబద్ధం: నాయక్
హైదరాబాద్: సినీనటి సాక్షి శివానంద్ తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని పారిశ్రామిక వేత్త రాజూ నాయక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో తాను కొన్న భూమిని రాజూ నాయక్ అనే వ్యక్తి కబ్జా చేశాడని సాక్షి శివానంద్ బుధవారంనాడు ఆరోపించారు. సాక్షి శివానంద్ ఆరోపణలను రాజూ నాయక్ గురువారం విలేకరుల సమావేశంలో ఖండించారు.
సాక్షి శివానందే తన ప్లాటును ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆయన ఎదురుదాడికి దిగారు. తాను కొన్న ప్లాటును సాక్షి శివానంద్ తనదంటూ బుకాయించిందని, అయితే తాము ఆ ప్లాటును కొని రిజిస్టర్ చేసుకున్న పత్రాలను ఆమెకు చూపామని ఆయన వివరించారు. సాక్షిశివానంద్‌కు 229వ నంబర్ ప్లాటు కొన్నారని, అయితే తాము కొన్న 227వ నంబర్ ప్లాటుపై ఆమె కన్నేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
