ఏపీలో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ టైం మార్పు..! ఆ స్టేషన్లో ఇకపై ఇలా..!
ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ప్రీమియర్ రైళ్లలో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express) కూడా ఒకటి. భారతీయ రైల్వేల్లో తాజాగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్లకు ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు స్టేషన్లలో టైమింగ్స్ కూడా మారుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీ మీదుగా ప్రయాణిస్తుున్న ఓ అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లో స్వల్ప మార్పు జరిగింది.
పొదనూరు నుంచి ధన్ బాద్ కు ప్రయాణించే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 16619కి ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో (Duvvada)సమయాల్ని మార్పు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తెల్లవారు జామున 4.43కు వస్తున్న ఈ రైలు ఇకపై ఐదు నిమిషాల ముందుగా అంటే 4.38కే రానుంది. రెండు నిమిషాల హాల్ట్ తర్వాత తిరిగి 4.40కి బయలుదేరి వెళ్లనుంది. ఈ మార్పు ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు.

పోదనూర్-ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. ఇది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న పోదనూర్ జంక్షన్‌ను, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జంక్షన్‌తో కలిపే ఎక్స్ ప్రెస్ రైలు. ఇది వారానికి ఒకసారి నడిచే నాన్-ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు. పొదనూర్ నుంచి ప్రతీ శనివారం ఉదయం 6.15కు ఇది ధన్ బాద్ కు బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇది ధన్ బాద్ చేరుకుంటుంది. మార్గమధ్యలో ఏపీలో ఈ రైలుకు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలో హాల్ట్ లు ఉన్నాయి.














Click it and Unblock the Notifications
