తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లో మార్పు..!

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రీమియం రైళ్లయిన వందే భారత్, అమృత్ భారత్ లతో పాటు పలు ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఉన్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఓ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express) రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ మధ్య రైల్వే విడుదల చేసింది.

Revised Train Timings: శ్రీకాకుళం జిల్లాలో 5 ఎక్స్ ప్రెస్ రైళ్లకు టైమింగ్స్ మార్పు- ఈ స్టేషన్లలో..!
Revised Train Timings: శ్రీకాకుళం జిల్లాలో 5 ఎక్స్ ప్రెస్ రైళ్లకు టైమింగ్స్ మార్పు- ఈ స్టేషన్లలో..!

జార్ఖండ్ లోని ధన్ బాద్ జంక్షన్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ జంక్షన్ కు రాకపోకలు సాగించే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగానే వెళ్తుంది. ఈ రైలు జార్ఖండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా తమిళనాడుకు రాకపోకలు సాగిస్తోంది. పలు స్టేషన్లలో ఈ రైలు హాల్ట్ ల సమయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో సత్నా, కట్నీ, జబల్ పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ స్టేషన్లు ఉన్నాయి.

Dhanbad Coimbatore Amrit Bharat Weekly Express Timings Revised at Key Stations
Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!
Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!

ఆయా స్టేషన్లో ప్రస్తుతం ధన్ బాద్-కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రస్తుతం ఆగుతున్న సమయాల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ రైలుకు సత్నా, కట్నీ, ఇటార్సీ స్టేషన్లలోనూ, అలాగే కోయంబత్తూర్ నుంచి ధన్ బాద్ వెళ్లే రైలుకు కట్నీ, జబల్ పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ స్టేషన్లలోనూ హాల్ట్ సమయాలు మారబోతున్నాయి. కాబట్టి ఆయా స్టేషన్లో దిగే, ఎక్కే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఈ మార్పును గమనించాలని అధికారులు కోరుతున్నారు. మిగతా స్టేషన్ల హాల్ట్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+