బీజేపీ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి.. మంత్రి నోట బూతులు.. వీడియో వైరల్!
కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున హరిహర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీష్‌పై తీవ్ర అభ్యంతరకరమైన, దూషణాత్మక భాషను ఉపయోగించినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాగునీటి కోసం భద్రా జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన రైతులతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మంత్రితో సమావేశమైన రైతులు..తమ ప్రాంతంలో తగినంత తాగునీరు లేదని, కనీసం తమ పశువులకు కూడా నీటి కరవు ఏర్పడిందని హరిహర్ ప్రాంత రైతులు దావణగెరె ఇంఛార్జి మంత్రి ఎస్ఎస్ మల్లికార్జునకు తమ సమస్యలను వివరించారు. తాము ఈ సమస్యపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీష్‌ను సంప్రదించగా..ఆయనే తమను మంత్రితో మాట్లాడాలని సలహా ఇచ్చారని రైతులు మంత్రికి తెలిపారు.

ఎమ్మెల్యే ప్రస్తావన రాగానే తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి మల్లికార్జున.. ఎమ్మెల్యే హరీష్‌పై విరుచుకుపడ్డారు. 'ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టండి' అని రైతులతో అనడమే కాకుండా.. ఆయనను 'అన్న' అని పిలవవద్దని కూడా రైతులకు సూచిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
తీవ్రమవుతోన్న రాజకీయ వివాదం
మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున కామెంట్స్ వీడియో రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. రైతుల సమస్యలను విని పరిష్కరించడానికి బదులుగా, మంత్రి వారిపై దుర్భాషలాడారని బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీష్ ఎదురుదాడి చేశారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా మంత్రి ఎస్ఎస్ మల్లికార్జునను లక్ష్యంగా చేసుకున్నారు. హరిహర్ ఎమ్మెల్యే బీపీ హరీష్‌పై మంత్రి అనుచిత భాషను ఉపయోగించారని, ఆయన తల్లిదండ్రులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉండి ఇలాంటి భాష వాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
No one, I repeat no one, can match the ‘level’ of Congress leaders when it comes to disrespecting women!
— Cons of Congress (@ConsOfCongress) September 9, 2026
From female leaders in their own party to mothers of their opposition, Congress leaders spare none.
Today, SS Mallikarjun, Congress MLA decided to slut shame the old-aged… pic.twitter.com/S3yBrmO8Tx
"దావణగెరె ఇన్‌చార్జి మంత్రి హరిహర్ ఎమ్మెల్యే హరీష్‌పై అనుచితమైన భాషను ఉపయోగించారు. ఆయన తల్లిదండ్రులను కూడా దూషించారు. ఇది హరీష్‌ను మాత్రమే కాకుండా, ఆయన నియోజకవర్గ ప్రజలను కూడా అవమానించారు. అధికారంలో ఉండి ఇలాంటి భాష వాడితే, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు" అని బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు.













Click it and Unblock the Notifications
