25 నుంచి విజయశాంతి తెలంగాణ పోరు
హైదరాబాద్: ప్రముఖ సినీనటి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు విజయశాంతి తన తెలంగాణ ఉద్యమానికి ఈ నెల 25వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. ఆమె ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ వస్తున్నారని విజయశాంతి యువసేన అధ్యక్షుడు వీరారెడ్డి బుధవారం విలేకరులతో చెప్పారు. ఆమె అదే రోజు యువసేన నిర్వహించే సదస్సులో పాల్గొంటారు.
పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తారు. రాజీనామాలను పార్టీ ఆమోదించకపోయినా ఆమె యువసేన కార్యక్రమాలకే పరిమితమవుతారని వీరా రెడ్డి చెప్పారు. ఆ రోజు నుంచి విజయశాంతి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటారని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు మకాం మార్చాలనే ఉద్దేశం వల్లనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి సమయం పట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications