సియంపి అమలుపై యుపిఎ- లెఫ్ట్ నిర్ణయం
న్యూఢిల్లీ: కనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి)ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ), వామపక్షాల సమావేశం నిర్ణయించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది పాలనను యుపిఎ, వామపక్షాల సమావేశం బుధవారంనాడు జరిగింది. సమావేవం ముగిసిన వెంటనే ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది.
గత ఏడాది పాలనలో సాధించిన విజయాలతో యుపిఎ ఒక బ్యాలెన్స్ షీట్‌ను తయారు చేస్తుంది. యుపిఎ, వామపక్షాల సమన్వయ కమిటీ ప్రభుత్వ పనితీరును ఆరు దశల్లో సమీక్షించడానికి పూనుకుంది. ఈ బ్యాలెన్స్ షీట్‌ను ఈ నెల 22వ తేదీన జరిగే వార్షికోత్సవసభలో విడుదల చేస్తారు. ఈ ఉత్సవాల్లో తాము పాల్గొనకపోవడం వల్ల కలిగే నష్టమేమీ లేదని సిపియం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. సియంపి ప్రాతిపదికపై తాము యుపి ఎ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్నామని, 22వ తేదీన జరిగే వార్షికోత్సవం ప్రభుత్వానికి సంబంధించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications