రెండు ఎన్‌కౌంటర్లు: నక్సల్ మృతి, జవానుకు గాయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు చోట్ల పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఒక ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నక్సలైట్ మరణించగా, మరో ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. వరంగల్ జిల్లా గొల్లబుద్దారం - దూదేకులపల్లి గ్రామాల మధ్య పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ లోకల్ గెరిల్లా దళానికి చెందిన సూర్యం కావచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి మందుపాతర, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమూల సమీపంలో నక్సలైట్లకు పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications
