తెలంగాణ ప్రాజెక్టులకు వైయస్ అడ్డంకులు: టిడిపి
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు టి. దేవేందర్ గౌడ్, సానా మారుతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కొన్ని ప్రాజెక్టులకే ఖర్చు చేస్తున్నారని, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఖర్చు చేయడం లేదని వారన్నారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పిస్తున్నారని వారన్నారు.
సోమశిలపై ఆదివారం జరిగే బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతి చెప్పారు. టెండర్లకు విపరీతమైన పోటీ ఉన్నందుననే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications