వైయస్, కెసిఆర్‌ల భేటీ ఉత్తుత్తదే: బిజెపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్‌రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు కె. చంద్రశేఖర్ రావు మధ్య జరిగిన చర్చలకు ప్రాధాన్యం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సిహెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ఇరువురు నేతల మధ్య చర్చలు, టి ఆర్‌యస్ రాష్ట్ర మంత్రుల రాజీనామాలు ఒక ప్రహసమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఇష్టం లేదని, అందకే రెండో ఎస్సార్సీ అంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రెండో ఎస్సార్సీ గురించి చేస్తున్న ప్రకటనలను టి ఆర్‌యస్ నుంచి సమాధానం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విసయంలో కాంగ్రెస్, టి ఆర్‌యస్ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications