లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్, టీడీపీ ఎంపీ సతీమణికి నోటీసులు..!!
లిక్కర్ కేసులో కీలక మలుపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలైన లిక్కర్ స్కాం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయాల మేర లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు.. అవినీతి జరిగిందనే ఆరోపణలతో సిట్ నియమించారు. కేసు విచారణ చేసారు. పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసారు. ఈ కేసు విచారణలో ఉంది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే విచారణ మొదలు పెట్టిన ఈడీ.. తాజాగా టీడీపీ ఎంపీ సతీమణికి నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది.
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు.. వారి సన్నిహితులకే పరిమితమైన విచారణ ఇప్పుడు టీడీపీ ఎంపీల కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సిట్ గుర్తించిన ఆర్దిక లావాదేవీల పైన విచారణ చేస్తుంది. తాగాగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో..రాజ్ కసిరెడ్డికి జరిగిన ఆర్దిక లావాదేవీలు.. ఆర్దిక పరమైన లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలోనూ జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది.

27న విచారణకు రావాలంటూ
కాగా, ఇప్పుడు తాజాగా మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ విచారణకు రావాలని స్పష్టంగా పేర్కొంది. మనీ లాండరింగ్.. ఎవరితో లావా దేవీలు జరిగాయి.. ఆర్దిక నెట్ వర్క్.. ఎవరి ఖాతా నుంచి ఎవరికి నగదు బదిలీ జరిగిందీ ఆరా తీస్తున్నారు. గతంలో ఈ కేసు విచారణ సమయంలోనే రాజ్ కేసిరెడ్డి తో కేశినేని చిన్ని కుటుంబం తో ఉన్న ఆర్దిక లావాదేవీల పైనా రాజకీయంగా చర్చ జరిగింది. ఇప్పుడు సమన్లు జారీ చేయటంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. విచారణ సమయంలో ఆర్దిక లావాదేవీలు.. ఇప్పటికే సేకరించిన సమాచారం పైన పూర్తి వివరాలు అడిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంపీ కేశినేని చిన్ని మాత్రం నోటీసులు కంపెనీకి వచ్చాయని.. తన సతీమణికి కాదని చెబుతున్నారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలని అప్పట్లో ప్రయత్నం జరిగిందని... ఈ నోటీసుల కు లిక్కర్ స్కాం కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications