భర్త బ్యాంక్ అకౌంట్‌పై భార్యకే సర్వాధికారాలు!

సతీమణిని 'అర్ధాంగి' (భర్తలో సగం భాగం) అని మన సంస్కృతి ఊరికే అనలేదు. కష్టకాలంలో భర్తకు నీడగా నిలిచే భార్య కంటే చట్టబద్ధమైన, నైతికమైన సంరక్షకులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ద్వారా నిరూపించింది. కోమాలో ఉన్న భర్త చికిత్స కోసం, కుటుంబ పోషణ కోసం డబ్బుల్లేక అల్లాడిపోతున్న ఒక సామాన్య మహిళకు హైకోర్టు అండగా నిలిచింది. టెక్నికల్ రూల్స్, ప్రభుత్వ అభ్యంతరాల కంటే మానవత్వమే మిన్న అని చాటుతూ.. వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన 59 ఏళ్ల నాగమ్మకు న్యాయస్థానం చారిత్రాత్మక ఊరటనిచ్చింది.

కోమాలోకి భర్త.. కూలబడిన కుటుంబం!

నాగమ్మ భర్త (65) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (CVA-left CG Hematoma), తల శస్త్రచికిత్స (FTP డీకంప్రెసివ్ క్రానియెక్టమీ) జరిగినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆయన స్పృహ లేని (వెజిటేటివ్/కోమా) స్థితిలో, వెంటిలేటర్ సాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. శ్వాస కోసం గొంతుకు పైపు (ట్రెకియోస్టోమీ), ఆహారం కోసం ముక్కుకు పైపు (రైల్ ట్యూబ్) వేసి నిరంతర వైద్య సంరక్షణ అందిస్తున్నారు. భర్త చికిత్స కోసం నాగమ్మ తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసేసింది. అటు భర్త వైద్య ఖర్చులు, ఇటు ఇద్దరు పిల్లల చదువులు, ఇల్లాలు గడవడం ఆమెకు పెనుభారంగా మారింది.

AP High Court Grants Comatose Man s Wife Right To Operate Bank Account For His Crucial Medical Expenses

చేతులు కట్టేసిన నిబంధనలు!

ఈ క్లిష్ట సమయంలో ఆమె భర్త పేరిట యాక్సిస్ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 14.38 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆమెకు ఆశాకిరణంగా కనిపించాయి. అయితే, ఖాతాదారుడు కోమాలో ఉండటంతో ఆ డబ్బును విత్‌డ్రా చేయడం సాంకేతికంగా సాధ్యం కాలేదు. దీంతో తన భర్తకు చట్టబద్ధమైన సంరక్షకురాలిగా (లీగల్ గార్డియన్) తనను నియమించి, ఆ ఖాతాను వాడుకునేలా అనుమతించాలని కోరుతూ నాగమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేర్ కన్వాయ్ రిహాబిలిటేషన్, న్యూ లైఫ్ రీహాబ్ హాస్పిటల్స్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్లు ఆయన కోమా స్థితిని ధృవీకరించాయి.

దేశాన్నే కదిలించిన రియల్ లవ్ స్టోరీ.. భార్య ప్రాణం కోసం 4 ఏళ్ల పాటు
దేశాన్నే కదిలించిన రియల్ లవ్ స్టోరీ.. భార్య ప్రాణం కోసం 4 ఏళ్ల పాటు

ప్రభుత్వ వాదనను తిరస్కరించిన హైకోర్టు

ఈ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టెక్నికల్ అభ్యంతరాన్ని లేవనెత్తింది. ఇది కేవలం సివిల్ వివాదమని, కాబట్టి పిటిషనర్ హైకోర్టుకు రాకూడదని, సివిల్ కోర్టును ఆశ్రయించాలని వాదించింది. అయితే, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ ఈ వాదనను పూర్తిగా తిరస్కరించారు. ఇలాంటి అత్యవసర మానవీయ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించడం ముమ్మాటికీ సమంజసమేనని స్పష్టం చేశారు.

"భర్త పూర్తిగా కోమాలో ఉండి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోయినప్పుడు.. నైతికంగా, చట్టబద్ధంగా లేదా సహజంగా ఆయనకు భార్య కంటే ఉత్తమమైన సంరక్షకులు మరొకరు ఉండరు" అని న్యాయమూర్తి 'అర్ధాంగి' ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

36 ఏళ్ల తర్వాత తీర్పు! తండ్రి ఆస్తిలో కూతురుకు సమాన హక్కు
36 ఏళ్ల తర్వాత తీర్పు! తండ్రి ఆస్తిలో కూతురుకు సమాన హక్కు

నాగమ్మకు లభించిన సర్వాధికారాలు

హైకోర్టు నాగమ్మ పిటిషన్‌ను ఆమోదిస్తూ, ఆమెను భర్త బ్యాంక్ ఖాతాకు సంరక్షకురాలిగా నియమించింది. భర్త వైద్యానికి, కుటుంబ అవసరాలకు ఆ నిధులను వాడుకునేందుకు పూర్తి అనుమతులు ఇచ్చింది. అయితే, దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు ఒక చిన్న షరతు విధించింది. నాగమ్మ తన అప్‌డేటెడ్ పాస్‌బుక్ లేదా ఖాతా స్టేట్‌మెంట్‌ను ప్రతి మూడు నెలలకోసారి.. ఏడాది పాటు లేదా ఏదైనా ప్రధాన వైద్య సంఘటన సంభవించే వరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ లైవ్‌లా (LiveLaw) నివేదించింది. చట్టం కళ్ళు మూసుకుంటుంది అంటారు కానీ, సమయం వచ్చినప్పుడు అదే చట్టం ఎంతటి మానవత్వాన్ని ప్రదర్శిస్తుందో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+