బంగారం ధరల్లో బిగ్ బ్లాస్ట్
భారత్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,59,265 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,59,050, 22 క్యారెట్లు రూ. 1,46,218 రూపాయలకు లభిస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి గల అన్ని అంశాలనూ సానుకూలంగా పరిశీలిస్తోన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వీటి రేట్లు పెరగడానికి ప్రధాన కారణమైంది.
మూడు నెలల గల్ఫ్ సంఘర్షణపై చర్చలు కొనసాగుతున్నా, శాంతి ఒప్పందాన్ని తొందరపడి ఖరారు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా.. ఇప్పట్లో దీనికి తెరపడకపోవచ్చనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో స్పాట్ బంగారానికి నెలకొన్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలహీనపడటం, ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి.

దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,59,150, అహ్మదాబాద్, పూణేలో రూ. 1,59,100; ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,59,050గా నమోదైంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,45,880; అహ్మదాబాద్, పూణేలో రూ. 1,45,830; ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,45,790గా నమోదయ్యాయి.
24 క్యారెట్లు- రూ. 16,124, 22 క్యారెట్లు - రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,938, 22 క్యారెట్లు- రూ. 14,610, 18 క్యారెట్లు - రూ. 11,954
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,938, 22 క్యారెట్లు- రూ. 14,610, 18 క్యారెట్లు - రూ. 11,954
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,938, 22 క్యారెట్లు- రూ. 14,610, 18 క్యారెట్లు - రూ. 11,954
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,938, 22 క్యారెట్లు- రూ. 14,610, 18 క్యారెట్లు - రూ. 11,954
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,938, 22 క్యారెట్లు- రూ. 14,610, 18 క్యారెట్లు - రూ. 11,954

Click it and Unblock the Notifications