ఈజిప్టులో పేలుళ్ళు:భారీ ప్రాణనష్టం
షరమ్ ఎల్ -షేక్(ఈజిప్టు) ఈజిప్ట్ దేశం షరమ్ ఎల్- షేక్‌లోపర్యాటకులతో కళకళలాడే సినాయ్‌రిసార్ట్ శనివారం తీవ్రవాద దాడులతో కళతప్పింది. ఆత్మాహుతి బాంబర్లు మూడు చోట్లపేలుళ్ళు సృష్టించడంతో 83 మంది మరణించారు.150 మంది దాకా గాయపడ్డారు. మృతి చెందినవారిలో బ్రిటన్‌వాసులు ఎక్కువ గా ఉన్నారు. స్థానికకాలమానం ప్రకారం అర్థరాత్రి ఒంటిగంటకుదాడులు జరిగాయి. ఘజాలా గార్డెన్ హోటల్ భవనం లోపల రిసెప్షన్ కౌంటర్‌దాకాకారుతో దూసుకెళ్ళిన బాంబరుతనను తాను పేల్చుకోవటంతో 30 మందిమరణించారు. వీరిలో ఎక్కువగా హోటల్‌సిబ్బందే ఉన్నారు. ఎనిమిదేళ్ళ క్రితం ఈ దేశంలో లక్సర్ ప్రాంతంలో 62మంది తీవ్రవాద దాడికి బలయ్యారు. ఆ తర్వాత ఇంతకాలానికిజరిగిన దారుణాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగాఖండించాయి.












Click it and Unblock the Notifications