శివసేన ఎమ్మెల్యేరాజీనామా:బలం పెరిగిన బిజెపి
ముంబాయి: శివసేననుంచి ఇటీవల వైదొలిగిన ఎమ్మెల్యే నారాయణ్‌రాణె శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కురాజీనామా పత్రం సమర్పించారు. ఆయనకాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు తీవ్రంగాచెలరేగాయి. పది మంది ఎమ్మెల్యేలు రాణెకుమద్దతు ఇవ్వడంతో అసెంబ్లీలో శివసేనసభ్యుల సంఖ్య 63 నుంచి 52కి పడిపోయింది.దాంతో సభలో బిజెపి సంఖ్య ఒక్కసారి 54కి పెరిగింది.ప్రతిపక్ష నేతగా తమ అభ్యర్థిని ఎంపికచేయాలని బిజెపి డిమాండ్ చేసింది. మరోఐదు నెలల వరకు ప్రతిపక్ష నేత పదవినిఖాళీగా ఉంచకుండా ప్రస్తుతం జరిగే వర్షాకాలసమావేశాలలోనే నేత ఎన్నిక పూర్తికావాలనిబిజెపి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్‌డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications