గట్టెక్కేందుకు వైయస్ దొడ్డిదారులు: బాబు
హైదరాబాద్: మున్సిపల్ గండాన్ని గట్టేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి దొడ్డిదారులు వెతుకుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కౌన్సిలర్లను కొనుగోలు చేయడానికి విప్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన స్వార్థం కోసం ముఖ్యమంత్రి స్థానిక సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని ఆయన అన్నారు.
శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు ఓటు హక్కు కల్పించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే పనికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టిందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి అప్రజాస్వామిక విధానాలకు తలుపులు తెరుస్తున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖపట్నం పేర్లు తెస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు సోకి మరణించిన 1094 మంది పేర్లను చంద్రబాబు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications