నక్సల్స్‌తో చర్చలకు ప్రయత్నాలు: జానారెడ్డి
విశాఖపట్నం: నక్సలైట్లతో చర్చలు జరపాలనేదే తమ ఉద్దేశమని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. అందుకు చర్చలు జరగాలని ఆశిస్తున్నవారి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చర్చలకు సుహృద్భావ వాతావరణం ఏర్పరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అవతలి వైపు నంచి కూడా అటువంటి వాతావరణ కల్పనకు ప్రయత్నం జరగాలని ఆయన అన్నారు.
నక్సల్స్‌తో చర్చలు జరిపే విషయంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకుడు కె. చంద్రశేఖర్ రావు మధ్య జరిగిన చర్చల్లో వచ్చిన ప్రస్తావనను గుర్తు చేయగా వారి అభిప్రాయాలు చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications