నెల్లూరు జిల్లాలో పది మంది నక్సల్స్ అరెస్టు?
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు పది మంది సిపిఐ (యంయల్) జనశక్తి నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జనశక్తి రాంపూర్ ఏరియా నాయకుడు ఈశ్వర్ మీడియా కార్యాలయాలకు పంపిన ఒక లేఖలో తెలియజేశారు. వారిని ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టు చేసినవారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన కోరారు.
అరెస్టయినవారిలో ముగ్గురు జనశక్తి నక్సలైట్లు కాగా ఏడుగురు సానుభూతిపరులని తెలుస్తోంది. కావలిలో అదుపులోకి తీసుకున్న వీరిని ప్రకాశం జిల్లా ఒంగోలుకు తరలించినట్లు చెబుతున్నారు. అరెస్టయినవారిలో గిరి, రాజు అనే నక్సలైట్లు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications