ఉద్యోగులకు పిఆర్‌సి నివేదిక: ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్: వేతన సవరణ సంఘం (పి ఆర్‌సి) నివేదకను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాంబాబు నేతృత్వంలోని కమిటీ సమర్పించిన ఈ నివేదికపై ప్రభుత్వం ముగ్గురు ఐ ఎయస్ అధికారులతో ఒక కమిటీ వేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల, ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి (జె ఎసి) వ్యతిరేకించింది. నివేదికను తమకు ఇవ్వాలని జె ఎసి డిమాండ్ చేసింది. నివేదికలోని పర్సంటేజీలను ప్రభుత్వం తారుమారు చేసిందని ఇప్పుడు జె ఎసి నాయకులు విమర్శిస్తున్నారు. పిఆర్‌సిపై ఉద్యోగులు శుక్రవారంనాడు ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రదర్శనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
