ఆర్టీసి సమ్మె కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా
హైదరాబాద్: ఆర్టీసి సమ్మె కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు పిటిషణ్ దాఖలు చేశారు. దీనికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేనందున తాము సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు చెప్పడంపై హైకోర్టు మండిపడింది. కేసు కోర్టు పరిధిలో ఉండగా కార్మిక సంఘాలు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసి వ్యవహారంపై కోర్టు ఆవరణలో కరపత్రాలు పంచినందుకు హైకోర్టు సిఐటియుకు నోటీసులు జారీ చేసింది.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు ఇటీవల సమ్మెకు దిగారు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. ఆ తర్వాత ప్రభుత్వం వేసిన మంత్రివర్గం ఉపసంఘం పలుమార్లు ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. అయినా కార్మిక సంఘాల నాయకులు తమ డిమాండ్ల విషయంలో పట్టువీడలేదు.












Click it and Unblock the Notifications
