మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరి పోరు: చంద్రబాబు

హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులను అరికట్టడంలో, మరణాలు నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. గిరిజనులు అంటువ్యాధులతో బాధపడుతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆయన ప్రభుత్వేతర సంస్థలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాము ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే రాజకీయం చేస్తూ ఎదురు విమర్శలను చేయడం ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుందని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ తమపై బిజెపి విమర్శ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు ఢిల్లీకి వెళ్లే అఖిల పక్ష ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వం వహించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+