కెసిఆర్‌ది మూడు నాల్కల ధోరణి: సిపిఐ
హైదరాబాద్: తెలంగాణ పరిష్కారం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు మూడు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
610 జీవో అమలు విషయంలో నిపుణుల కమిటీ సలహాలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ఢిల్లీలో హైడ్రామా ఆడారని, దీనివల్ల ఆరు అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణపై నాటకాలు ఆడకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిర్దిష్ట కాలపరిమితితో నిర్దిష్ట ప్రతిపాదనలు రూపొందించి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
