నవీష్‌ హత్య: సిఐ అరెస్టు, రమణమూర్తి ఒప్పుకోలు

హైదరాబాద్‌: టిమ్స్‌ అధిపతి నవీష్‌మూర్తి హత్య కేసులో జనహర్ష మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమణమూర్తితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నవీష్‌మూర్తి హత్యలో రమణమూర్తి స్వయంగా పాల్గొన్నట్లు కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. నేరాన్ని రమణమూర్తి అంగీకరించాడు. రమణమూర్తితో పాటు మరో ఏడుగురికి కోర్టు ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు కోర్టు జ్యుడిష్యల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సంఘటనలో రమణమూర్తికి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌సింగ్‌ సహకరించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమీషనర్‌ మహేందర్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. నవీష్‌మూర్తి హత్య కేసులో ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

మహేందర్‌ రెడ్డి కథనం ప్రకారం - విజయ్‌సింగ్‌ సహకారంతో ఆదర్శనగర్‌లో అద్దెకు తీసుకున్న ఒక ఇంటికి నవీష్‌మూర్తిని పిలిపించారు. అప్పటికే రమణమూర్తి అనుచరులు ముగ్గురు అందులో కాపు కాచుకుని ఉన్నారు. ఇంట్లోకి వెళ్లగానే విజయ్‌సింగ్‌ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. దీంతో నవీష్‌ మూర్తి స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత సమీపంలోని ఒక హోటల్‌లో మరో ముగ్గురు అనుచరులతో కాచుకుని ఉన్న రమణమూర్తికి విజయ్‌సింగ్‌ నవీష్‌మూర్తి సమాచారం అందించాడు. రమణమూర్తి తన అనుచరులతో అక్కడికి చేరుకుని నవీష్‌మూర్తికి డైజోఫామ్‌ను ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించాడు. ఆ బాధకు నవీష్‌మూర్తి మూలిగాడు. చనిపోలేదని భావించిన రమణమూర్తి, అతని అనుచరులు నవీష్‌మూర్తి ముక్కు, నోరు మూసి హత్య చేశారు.

అనంతరం నవీష్‌మూర్తి శవాన్ని కారులో మనిషి కూర్చున్నట్లుగా కట్టివేసి తీసికెళ్లారు. రవికుమార్‌ అనే వ్యక్తి ముందు కారులో పోతూ నవీష్‌మూర్తి శవాన్ని ఉంచిన కారుకు పైలట్‌ చేస్తూ వచ్చాడు. అలాగే అతడ్ని ఉప్పల్‌లోని లింగం ఇంటికి తీసికెళ్లారు. లింగం అద్దెకు తీసుకున్న ఇంటిలో శవాన్ని ఒక రాత్రి, ఒక పగలు, ఒక రాత్రి ఉంచారు. రాత్రి మూడు గంటల ప్రాంతంలో గోయి తవ్వి శవాన్ని పాతి పెట్టాలనుకున్నారు. అయితే వాన జోరుగా ఉండడంతో గోయి తవ్వడం సాధ్యం కాలేదు. దీంతో లింగం ఇంటిలో కిచెన్‌ ఫ్లాట్‌ఫారమ్‌ కట్టి దాని కింద పాతి పెట్టాలని ప్రయత్నించారు.

నవీష్‌మూర్తి హత్య కేసులో పింగళి చైతన్య పాత్ర ఏమిటనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని, ఆమె పరారీలో ఉందని, అరెస్టు చేసిన తర్వాత ఆమె పాత్ర ఏమిటనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+