నవీష్ హత్యకు కారణం కంపెనీ కాదు : రమణమూర్తి
హైదరాబాద్: టిమ్స్ అధిపతి నవీష్‌మూర్తిని రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చంపలేదని జనహర్ష మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి స్పష్టం చేశారు. జై భారత్ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం పత్రిక జర్నలిస్టు పింగళి చైతన్య కిడ్నాప్ కేసులో నవీష్‌మూర్తిని పోలీసులు అరెస్టు చేయలేదని, అందుకే నవీష్‌మూర్తిని చంపానని ఆయన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. తనతో పాటు మరో ఏడుగురిని సోమవారం కోర్టులో హాజరుపరిచే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కంపెనీ వ్యవహారాల వల్లనో, ఆస్తి తగాదాల వల్లనో నవీష్‌మూర్తిని హత్య చేయలేదని, జులై 14వ తేదీన జరిగిన పింగళి చైతన్య కిడ్నాప్ కేసులో పోలీసులు నవీష్‌మూర్తిని అరెస్టు చేయడం అటుంచి కనీసం ప్రశ్నించలేదని, అందుకే నవీష్‌మూర్తిని హత్య చేశామని ఆయన చెప్పారు. విజయవిహారం పత్రికకు, జైభారత్‌కు ఎవరు హాని తలపెట్టినా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. నవీష్‌మూర్తి జనహర్షలో షేర్ హోల్డర్ కాదని, నవీష్‌మూర్తిపై ఫోర్జరీ కేసు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
