మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదే: బాబు
హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు మంగళవారం ఉదయం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర మంత్రులు అవినీతి చర్యల్లో కూరుకుపోయారని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఇప్పటికే నైతిక విజయం సాధించామని ఆయన చెప్పారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడం, మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం, విప్‌ను రద్దు చేయాలని ప్రయత్నించడం తమ నైతిక విజయానికి తార్కాణాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గత 14 నెలల్లో చేసిందేమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
