యస్‌ఆర్‌యస్‌పి అవినీతిపై పొన్నాలకు సవాల్
వరంగల్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (యస్‌ఆర్‌పియస్) పనుల్లో అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి సవాల్ చేశారు. మంత్రి స్వయంగా గానీ, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులుగానీ బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మంగళవారం ఆ సవాల్ విసిరారు.
యస్‌ఆర్‌పియస్‌లో అవినీతి ఏరులై పారుతోందని, దాన్ని తాము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అవినీతి జరిగినట్లు రుజువు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకుంటుందని, ఒకవేళ తాము అవినీతిని రుజువు చేస్తే కాంగ్రెస్ పోటీ చేయకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
