వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై రాజ్యసభలో రభస
వోక్స్ వ్యాగన్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విఫలయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లో విమర్శించారు. వశిష్ట వాహన్‌కు చెల్లించిన 11 కోట్ల రూపాయలు ఏమయ్యాయనేది తేలడం అవసరమని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ చెల్లింపుకు బాధ్యులైన మంత్రులు, అధికారులు, ఇతరులను అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నదని వారన్నారు. కేసు నమోదు చేయకుండా సిబి ఐ దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందని వారు ప్రశ్నించారు. వోక్స్ వ్యాగన్ ప్రతినిధి ఫ్రాంక్ ఎల్బే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మబోరని వారన్నారు.












Click it and Unblock the Notifications
