నా కమిటీ నా ఇష్టం:కేశవరావు
హైదరాబాద్: కొత్తగాఏర్పాటు అయిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిలోనిపేర్లు తన ఇష్టాను సారమే నిర్ణయమయ్యాయని...కమిటీలో వారి మనుషులు వీరి మనుషులూఅంటూ ఎవరూ లేరని.... అంతా తనమనుషులేనని పార్టీ అధ్యక్షుడు కె.కేశవరావుస్పష్టం చేశారు. శనివారం జరిగిన టిఆర్‌సిసిసిసమావేశం అనంతరం ఆయన విలేకరులసమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగారాష్ట్ర కమిటి గురించి వి.హన్మంతరావుచేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకురాగాఆవేశంగా బదులిస్తూ, పార్టీ అవసరాల దృష్ట్యాకమిటీలో ఎవరుండాలో..ఎవరు ఉండకూడదోతాను నిర్ణయించుకుంటానని, గత ఎన్నికలలోఓడిపోయిన వారిని పిసిసిలోకి తీసుకోవటం కూడాతన నిర్ణయమేనని తెలిపారు. అంటే కమిటీలోకితీసుకోని వారు అనర్హులా అని ప్రశ్నించగా ప్రశ్నించటంవిలేకరుల హక్కులాగానే తన కమిటినిర్ణయించుకోవటం తన హక్కని ఆయనజవాబిచ్చారు.












Click it and Unblock the Notifications