జవాన్ కు అన్యాయం.. కమిషనరేట్ ను చుట్టుముట్టిన ఆర్మీ
సరిహద్దుల్లో శత్రువుల తూటాలకు ఎదురొడ్డి, రాత్రి పగలు అనక దేశాన్ని కాపాడే ఒక జవాన్ కన్నతల్లికి నగరంలో ఘోర అన్యాయం జరిగింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల రాక్షస నిర్లక్ష్యానికి ఆ వృద్ధురాలి కుడి చేయి బలవుతుంటే.. వ్యవస్థలు మౌనంగా చూశాయి. న్యాయం కోసం ఆ జవాన్ కత్తిరించిన తన కన్నతల్లి చేతిని థర్మోకోల్ బాక్సులో పెట్టుకుని రోడ్డుకెక్కినా స్థానిక పోలీసులు కరగలేదు.
కానీ, దేశాన్ని కాపాడే ఒక సైనికుడి కన్నీటికి న్యాయం జరగకపోతే.. ఆ సైన్యమే కదలివస్తుందని నిరూపిస్తూ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) బలగాలు కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌ను చుట్టుముట్టాయి! తమ తోటి జవాన్‌కు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ నేతృత్వంలో సుమారు 50 మంది యూనిఫాంలో ఉన్న ఐటీబీపీ వీరులు సింహాల్లా కమిషనరేట్ ముందర వాలడం కాన్పూర్ వ్యాప్తంగా పెను వణుకు పుట్టించింది. ఒక జవాన్ ఆత్మగౌరవం కోసం, అతని కన్నతల్లి న్యాయం కోసం సాగిన ఈ భావోద్వేగ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కన్నతల్లి కన్నీరు.. కాలయముడైన 'కృష్ణ’ ఆసుపత్రి!
ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ కన్నతల్లి నిర్మలా దేవి (56) మే 5న అనారోగ్యానికి గురవడంతో ఆమెను కాన్పూర్‌లోని 'కృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో చేర్చారు. ఐటీబీపీ ప్యానెల్‌లోనే ఉన్న ఈ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు.. కేవలం సంతకాలు చేయించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, ప్రాణం కాపాడే వైద్యం చేయలేదు. వెంటిలేటర్ పేరుతో ఆమెను చేర్చుకున్న మరుసటి రోజు ఉదయానికే ఆమె కుడి చేయి నల్లగా మారిపోయి, వాచిపోయింది. "అమ్మా.. నొప్పితో నరకం చూస్తోంది.. దయచేసి చూడండి" అని జవాన్ వికాస్ సింగ్ కాళ్లు పట్టుకున్నంత పనిచేసినా ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదు. కేవలం ఒక ఆయింట్‌మెంట్ రాసి బ్యాండేజ్ వేసి వదిలేశారు.
#WATCH | Kanpur, Uttar Pradesh | A serving ITBP personnel arrives at Police Commissioner's Office carrying his mother's severed hand, alleging hospital negligence pic.twitter.com/gV9xa3SiB3
— ANI (@ANI) May 19, 2026
పరిస్థితి చేదాటిపోయాక ఆమెను 'పారస్ ఆసుపత్రి’కి తరలించగా.. కృష్ణ ఆసుపత్రి వైద్యుల ఘోర నిర్లక్ష్యం వల్ల చేతికి రక్తప్రసరణ ఆగిపోయి, కుళ్ళిపోయిందని వైద్యులు తేల్చారు. ఇన్ఫెక్షన్ గుండెకు పాకకుండా ఉండాలంటే చేయి తీసేయాలనడంతో.. మే 17న ఆమె కుడి చేతిని కత్తిరించి వేరు చేశారు.
గుండె కోత.. కత్తిరించిన చేతితో కమిషనరేట్‌కు!
దేశాన్ని కాపాడే జవాన్ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగినా, రైల్బజార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించి చమురు కంపెనీల కంటే ఘోరంగా ప్రవర్తించారు. వ్యవస్థలు అమ్ముడుపోయాయని గ్రహించిన జవాన్ వికాస్ సింగ్.. మే 19న తీవ్ర భావోద్వేగంతో, తన తల్లికి నరికివేసిన చేతిని థర్మోకోల్ బాక్సులో పెట్టుకుని నేరుగా కమిషనరేట్ మెట్లు ఎక్కారు. ఆ దృశ్యాలు మీడియాలో వైరల్ కావడంతో కమిషనర్ రఘుబీర్ లాల్ దిగొచ్చి సీఎంఓ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) తో విచారణ కమిటీ వేశారు. కానీ, ఆ నివేదికలో తప్పు చేసిన ఏ ఒక్క డాక్టర్ పేరు కూడా లేకుండా లోపాలను కప్పిపుచ్చేలా 'బోగస్’ నివేదిక ఇచ్చి జవాన్ గాయాన్ని మరింత రేపారు.
తోటి జవాన్ కోసం కదలివచ్చిన సైన్యం.. కమిషనర్ దిగొచ్చిన వేళ!
వైద్య కమిటీ ఆసుపత్రికి తొత్తుగా మారిందని తెలియడంతో ఐటీబీపీ స్పందించింది. దేశ సరిహద్దుల్లో ఉండే సైన్యం తన జవాన్ వెనుక కొండలా నిలబడింది. శనివారం కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ నేతృత్వంలో భారీగా ఐటీబీపీ బలగాలు కాన్పూర్ కమిషనర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. ఎలాంటి ఘర్షణ పడకుండా, క్రమశిక్షణతో కూడిన సైన్యంగా కమిషనరేట్ బయట పహారా కాశారు. ఒక కమాండెంట్ అంతటి అధికారి స్వయంగా రంగంలోకి దిగి కమిషనర్ రఘుబీర్ లాల్‌తో టేబుల్ ఫైట్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ల్యాబ్ పరీక్షలు చేయకుండానే చేసినట్లు అబద్ధాలు చెప్పిందని డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆధారాలతో సహా నిరూపించారు.
VIDEO | Kanpur, UP: ITBP personnel reach the Kanpur Police Commissionerate in large numbers alleging inaction by the police in the case of medical negligence during treatment of a personnel's mother at a hospital, resulting in the amputation of her arm.
— Press Trust of India (@PTI_News) May 24, 2026
(Full video available on… pic.twitter.com/J9gtq8nCqE
ఐటీబీపీ దెబ్బకు దిగొచ్చిన పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్.. గతంలో జరిగిన తూతూమంత్రం విచారణను రద్దు చేస్తూ, తక్షణమే 'కొత్త విచారణ’కు ఆదేశించారు. ఈసారి బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, జవాన్‌కు న్యాయం చేస్తామని ఆర్మీ అధికారుల ముందే హామీ ఇచ్చారు.
ఆసుపత్రి కాదు.. అదొక మృత్యుకూపం!
కృష్ణ ఆసుపత్రిలో ఇలాంటి దారుణాలు జరగడం ఇదే మొదటిసారి కాదని ఐటీబీపీ సంపర్కాధికారి అర్పిత్ సింగ్ సంచలన విషయాలు బయటపెట్టారు. గతంలో కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన ఒక మహిళా కానిస్టేబుల్, అలాగే ఒక ఇన్‌స్పెక్టర్ కూడా ఇదే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. తమ జవాన్ తల్లి చేతిని బలితీసుకున్న ఆ మృత్యుకూపాన్ని సీజ్ చేసి, బాధ్యులైన వైద్యులను జైలుకు పంపేంతవరకు తాము వదిలిపెట్టేది లేదని ఐటీబీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి














Click it and Unblock the Notifications