వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిసి రిజర్వేషన్ల తొలగింపునకు వైయస్ కుట్ర: బాబు
హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బిసి) రిజర్వేషన్లను పూర్తిగా తొలగించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తాము మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింలకు ఐదు శాతం టికెట్లు ఇస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో బిసిలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీలకు పరోక్ష ఎన్నికలు కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేకు విజ్ఞప్తి చేసింది. రాజభవన్ వరకు ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం నాయకులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!