వరదల వల్ల ముప్పు లేదు: వైయస్‌

హైదరాబాద్‌: వరదల వల్ల ప్రమాదమేమీ లేదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. అయితే మరో పది రోజులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. వరదకు గురైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించడానికి బయలుదేరే ముందు మంగళవారం ఉదయం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏ చిన్న తప్పు జరిగినా పత్రికలు పెద్దగా చేస్తున్నాయని, అందువల్ల ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

వరదల వల్ల పరిస్థితి అధ్వాన్నంగా ఏమీ మారలేదని, వరద ముప్పుకు ఏ ఒక్కరూ మరణించలేదని ఆయన అన్నారు. సమస్యలేవీ లేవని, అయితే పునరావాస శిబిరాలు ఎలా సాగుతున్నాయనేది తాను పరిశీలించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. మరో పది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+