వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌ సభకు వస్తూ 4గురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1984 అల్లర్ల బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. నానావతి కమీషన్‌ నివేదికపై జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ ఆయన బుధవారం సాయంత్రం లోక్‌సభలో అన్నారు. ఢిల్లీ అల్లర్లు దేశానికి మచ్చలాంటివని ఆయన అన్నారు. ఢిల్లీ, గుజరాత్‌ అల్లర్లు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నానావతి కమీషన్‌పై లోక్‌సభలో బుధవారం చర్చ కొనసాగింది.

సిక్కులపై 1984లో జరిగిన దాడులకు సంబంధించి నానావతి కమీషన్‌ నివేదికలో పేర్కొన్నవారిని కాపాడడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు ఎల్‌.కె. అద్వానీ ప్రశ్నించారు. అల్లర్లను నిర్వహించిందెవరనేది తేల్చాలని ఆయన ప్రధానిని కోరారు. పోలీసులు వ్యవహరించిన తీరును గమనిస్తే అప్పుడు పై నుంచి వారికి స్పష్టమైన ఆధారాలున్నాయని అర్థమవుతుందని ఆయన అన్నారు. ఆ ఆదేశాలిచ్చిందెవరనేది తేలాలని ఆయన అన్నారు. రాజీవ్‌గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గవాయ్‌ని పిలిచి సెలవుపై వెళ్లాలని సూచించారని ఆయన అన్నారు.

నానావతి కమీషన్‌ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. నానావతి కమీషన్‌ నివేదికపై చర్చకు అనుమతించాలని బిజెపి నేతృత్వంలోని యన్‌డి ఎ డిమాండ్‌ చేసింది. ప్రధాని సభలో లేనందున చర్చించడం కుదరదని రాజ్యసభ చైర్మన్‌ బైరాన్‌సింగ్‌ షెకావత్‌ చెప్పారు. అయినా సభ సద్దుమణగలేదు. దీంతో సభను చైర్మన్‌ రేపటికి వాయిదా వేశారు.

ఇదిలావుంటే, కేంద్ర మంత్రి జగదీశ్‌ టైట్లర్‌ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. మంత్రి పదవికి టైట్లర్‌ రాజీనామా చేయవచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి. ఢిల్లీ అల్లర్లలో టైట్లర్‌ ప్రమేయం ఉన్నట్లు నానావతి కమీషన్‌ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. యన్‌డి ఎ, వామపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లలో టైట్లర్‌, కాంగ్రెస్‌ నాయకుడు సజ్జన్‌కుమార్‌ల ప్రమేయంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X