అన్న పిలిస్తే టిడిపిలోకి వస్తా: రామ్మూర్తినాయుడు

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డంకులు కలిగించే వేదికలను స్థాపించవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌), కేంద్ర మంత్రి సినీనటి విజయశాంతికి సలహా ఇచ్చారు. 610 జీవో అమలుకు గిర్‌గ్లానీ కమీషన్‌ కాకుండా మరో కమిటీ వేయాలని తాము కోరలేదని ఆయన గురువారం సంగారెడ్డిలో వివరణ ఇచ్చారు. 610 జీవో అమలుకు గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదిక ఉండగా టి ఆర్‌యస్‌ మరో కమిటీ వేయాలని కోరడమేమిటని విజయశాంతి వేసిన ప్రశ్నకు సమాధానంగా నరేంద్ర వివరణ ఇచ్చారు.

నవంబర్‌ ఒకటవ తేదీన బ్లాక్‌ డేగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాలను ఏడాది పొడుగునా నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్వహించకపోయినా తాము సెప్టెంబర్‌ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సమైక్యవాది చంద్రబాబుకు వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పుట్టగతులుండవని ఆయన అన్నారు. బిసి జాబితాను సవరించకుండా ఎన్నికలకు దిగితే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. బిసిలను అణచివేసేందుకు అగ్రకులాల నాయకులు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. పులిచింతలపై న్యాయపోరాటం తప్పదని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడి జరిగే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+