మొద్దు శ్రీను అరెస్టుకు మీడియా సహకారం: వైయస్
కర్నూలు: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శ్రీనును అరెస్టు చేయడానికి మీడియా సహకరించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజీవ్ నగరబాటలో పాల్గొనడానికి గురువారం ఇక్కడికి వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. మొద్దు శ్రీనును ఇంటర్వ్యూ చేసిన మీడియా ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చి వుండాల్సిందని ఆయన అన్నారు.
పరిటాల రవి హత్య కేసు, మొద్దు శ్రీను అరెస్టు వ్యవహారం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) పరిధిలోకి వెళ్లాయని, సిబిఐ చట్టప్రకారం చర్య తీసుకుంటుందని ఆయన అన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మొద్దు శ్రీనును మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేయడం తప్పని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications
