లక్ష్మణ్, కుంబ్లేలపై వేటు: సచిన్ సిద్ధం
ముంబాయి: అందరూ భావించినట్లుగానే హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్, స్పిన్నర్ అనిల్ కుంబ్లేలపై వేటు పడింది. జింబాబ్వేలో జరిగే ముక్కోణపు వన్డేలో ఆడే భారత క్రికెట్ జట్టులో లక్ష్మణ్, కుంబ్లే తమ స్థానాలను కోల్పోయారు. భారత్, జింబాబ్వే, న్యూజిలాండ్‌ల మధ్య జింబాబ్వేలో ముక్కోణపు వన్డే పోటీలు జరగనున్నాయి. జింబాబ్వే పర్యటనకు వెళ్లే వన్డే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది.
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్, మీడియం పేసర్ అజిత్ అగార్కర్, స్పిన్నర్ మురళీ కార్తిక్‌లను తిరిగి జట్టులోకి ఆహ్వానించారు. గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమైన సచిన్ జింబాబ్వే పర్యటనకు సిద్ధమయ్యాడు.












Click it and Unblock the Notifications
