ఉత్ప్రేరకాలు వాడిన భారత అథ్లెట్ నీలమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశ ప్రతిష్టపై మరోసారి మచ్చ పడింది. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో జరుగుతున్న 10వ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటున్న భారత్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారిణి నీలమ్ జస్వంత్ సింగ్ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ పాలకమండలి శనివారం ప్రకటించింది.
ఈ నెల 7వ తేదీన పోటీల ప్రిలిమనరీ రౌండ్‌లో పాల్గొనడానికి వెళ్లిన నీలమ్ పీమోలిన్ అనే ఉత్ప్రేరకాన్ని వాడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో నీలమ్‌ను అంతార్జతీయ అథ్లెటిక్ సమాఖ్యల సంఘం సస్పెండ్ చేసింది. నేరం రుజువైతే నీలమ్‌పై రెండేళ్ల సస్పెన్షన్ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications
