తప్పనిసరి పరిస్థితుల్లోనే నక్సల్స్‌పై నిషేధం: బొత్సా
విజయనగరం/ చిత్తూరు: తప్పనిసరి పరిస్థితుల్లోనే మావోయిస్టులపై ప్రభుత్వం నిషేధం తిరిగి విధించిందని మార్కెటింగ్ శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. నక్సలైట్లలో మార్పు కోసం ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసిందని, శాంతియుత పరిస్థితులన నెలకొల్పడానికి నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. సానుభూతితో ప్రభుత్వం వ్యవహరించిందని, అయితే వాతావరణంలో మార్పు రాలేదని ఆయన అన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవడానికి తగిన పరిస్థితులన్నీ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే మావోయిస్టులపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చిత్తూరులో అన్నారు.












Click it and Unblock the Notifications