అజ్ఞాతంలోకి వెళ్లం: కృష్ణాబాయి, చలసాని ప్రసాద్
విశాఖపట్నం: తాము అజ్ఞాతంలోకి వెళ్లే ప్రసక్తి లేదని విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రధాన కార్యదర్శి కృష్ణాబాయి, కార్యవర్గ సభ్యుడు చలసాని ప్రసాద్ స్పష్టం చేశారు. విరసంపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో వారు గురువారం ఈ ప్రకటన చేశారు. నిషేధం ప్రభుత్వ దివాళాకోరుతనానికి, లేకితనానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. తమ సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు చెప్పారు.
విరసంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కూడా వారు చెప్పారు. నిషేధం విధించిన తర్వాత చట్టప్రకారమే దాని అమలుకు మూడు నెలల వ్యవధి వుంటుందని వారన్నారు. తమది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని వారు చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతాలతో తమ సంస్థకు ఏకాభిప్రాయం ఉందని, తాము తమ సిద్ధాంతాల మేరకు పని చేస్తామని వారన్నారు.
తాను విరసం కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశానని, అయితే విరసం అభిప్రాయాలతోనే కొనసాగుతున్నానని, గడ్డు కాలంలో మనిషికి మనిషి తోడు అవసరమని, కావాలనుకుంటే పోలీసులు తనను అరెస్టు చేయవచ్చునని విప్లవ కవి వరవరరావు హైదరాబాద్‌లో అన్నారు. ఇది వరకు తనను అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని, అందుకు తాను సిద్ధమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications