వైయస్ సోనియా చేతిలో కీలుబొమ్మ: సింఘాల్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా పని చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత అశోక్ సింఘాల్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారంనాడు తిరులమను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో మంతనాలు జరిపారు. ఇరువురి మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. సమావేశం వివరాలను వెల్లడించానికి జయేంద్ర సరస్వతి నిరాకరించారు.
ఏడాదిలోగా అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తామని అశోక్ సింఘాల్ చెప్పారు. ఈ లోగా రాముడికి ప్రాణప్రతిష్ట చేస్తామని ఆయన అన్నారు. హిందూ మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications